Business Information of HYDERABAD* Business Directory*Trade services of * MFRS and Suppliers* shop keepers*About HYD dealers*HYD online Business*HYD online directory*HYD Trade Directory*HYD Trade information*Industries of HYD*Commrcial Establishments in HYD*Business Information of HYD*Departmental stores in HYD*Companies in HYD*HYD Business details*Services of HYD*HYD services directory* About HYD*HYD Schools* HYD Hospitals *HYD Hotels వేధించే మెడనొప్పి - Hyderabad Classifieds - Channel Hyderabad
Headlines News :
Go
Home » » వేధించే మెడనొప్పి

వేధించే మెడనొప్పి

Written By CHANNEL HYDERABAD on Wednesday, 25 September 2013 | 23:46


ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కన్పించే సర్వికల్‌ స్పాండైలోసిస్‌ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా ఇటీవల యుక్తవయసులో ఉన్న వారు సైతం ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం మారుతున్న జీవన శైలి విధానమే. మెడనొప్పే కదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. అలా కాకుండా వ్యాధి తొలి దశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది.

మెడ వెనుక భాగంలో తల నుండి మొదలయ్యే మొదటి 7 వెన్నుపూసల మధ్య సులువుగా కదిలేంకు కార్టిలేజ్‌ (మృధులాస్థి) అనే మెత్తని ఎముక ఉంటుంది. వెన్నుపూస సులువుగా కదలడానికి కార్టిలేజ్‌ తోడ్పడుతుంది. ఈ ఎముక ఒక్కోసారి పెరిగి అస్టియోఫైట్స్‌ ఏర్పడుతాయి. ఇలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పుల వలన తీవ్రమైన మెడనొప్పితో వేధించబడతారు. ఇలాంటి సమస్యనే సర్వికల్‌ స్పాండిలోసిస్‌ అంటారు

మెడ నొప్పికి కారణాలు
ఈ ససమ్య ముఖ్యంగా వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలేజ్‌ క్షీణించి, ఆస్టియోఫైట్స్‌ ఏర్పడటం వలన వస్తుంది. స్పాంజ లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీల్లో అసంబద్ధ బంగిమల్లో కూర్చోవడం, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చొని విధులను నిర్వర్తించడం. ఒకే చోట గంటల తరబడి కదలకుండా పని చేయడం, నిత్యం తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్స్‌ లోపించడం.

లక్షణాలు
మెడనొప్పి తీవ్రంగా ఉండి మెడ ఎటువైపు కదల్చినా నొప్పి తీవ్రత పెరుగుతుంది.
నాడులు ఒత్తిడికి గురికావడం వల్ల నొప్పి భుజాల మీదుగా చేతులకు వ్యాపిస్తుంది.
తిమ్మిర్లు ఎక్కువగా ఉండి, తల తిప్పినట్లుగా అన్పించడం, చెయ్యిపైకి ఎత్తడం కష్టంగా మారుతుంది.
నడుస్తున్నప్పుడు, నిలబడినప్పుడు తూలుతున్నట్లుగా అనిపించడం జరుగుతుంది.

జాగ్రత్తలు
సెర్వికల్‌ స్పాండిలోసిస్‌తో వేధించబడేవారు సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. వాహనం నడిపేటప్పుడు, కుర్చిలో కుర్చున్నప్పుడు నడుము నిటారుగా ఉండే విధంగా సరైన స్థితిలో కూర్చోవాలి. బరువులు ఎక్కువగా లేపరాదు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బెడ్‌రెస్ట్‌ తీసుకోవడం తప్పనిసరి. బల్ల మీదగాని, నేల మీద గాని పడుకోవాలి. తల కింద ఎతె్తైన దిండ్లు వాడకూడదు. మెడను ఒకేసారి అకస్మాతుత్గా తిప్పకూడదు. మెడనొప్పి ఉన్నప్పుడు స్వల్ప వ్యాయామాలు డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే చేయాలి. మెడనొప్పి రాకుండా ఉండటానికి పౌస్టికాహారాన్ని తీసుకుంటూ నిత్యం వ్యాయామం, ప్రాణాయామం, యోగా చేయాలి.

చికిత్స
హోమియో వైద్యంలో సెర్వికల్‌ స్పాండిలోసిస్‌కు మంచి చికిత్స ఉంది. వ్యాధి లక్షణాలను, వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణలోకి తీసుకొని మందులను ఎన్నుకొని వైద్యం చేస్తే మెడనొప్పి నుండి విముకిత పొందవచ్చు.

మందులు:
బ్రయోనియా: మెడ కదిలించడం వలన నొప్పి అధికమవుతుంది. విశ్రాంతి వలన నొప్పి తగ్గుతుంది. వీరు మలబద్ధకంతో బాధపడుతుంటారు. దాహం అధికంగా కలిగి ఉండి నీరు ఎక్కువగా తాగుతారు. మానసికంగా వీరికి కోపం ఎక్కువ. వీరిని కదిలించకూడదు. కదలికల వలన వీరికి బాధలు ఎక్కువ్వడం గమనించ దగిర లక్షణం. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది. హైపరికం: నొప్పి మెడ, భుజకండరాల్లో తీవ్ర స్థాయిలో ఉంటుంది. కదలికలు కష్టంగా మారతాయి.
సై్పజీలియా: నొప్పి మెడ నుండి మొదలై ఎడమ భుజములో ఎక్కువగా ఉండి వేధించే వారికి ఈ మందు ప్రయోజనకారి.
కాల్మియా: నొప్పి మెడ నుండి మొదలై కుడి భుజములో ఎక్కువగా ఉండి వేధించే వారికి ఈ మందు తప్పక ఆలోచించ దగినది.
కోనియం: మెడ నొప్పితో పాటు కళ్లు తిరిగినట్లుగా అనిపిస్తుంది. మెడ అటు ఇటు తిప్పినప్పుడు వస్తువులు గుండ్రంగా తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. వృద్దుల్లో వచ్చే మెడ నొప్పికి ఈ మదు తప్పక వాడదగినది.
ఈ మందులే కాకుండా కాక్యులస్‌, రస్‌టాక్స్‌, ఆర్నికా, రూటా, కాల్కేరియాకార్బ్‌, సల్ఫర్‌, కాలికార్బ్‌ వంటి మందులను లక్షణ సముదాయాలను పరిగణలోకి తీసుకొని వైద్యం చేస్తే ‘సెర్వికల్‌ స్పాండిలోసిస్‌’ (మెడనొప్పి) నుండి విముక్తి పొందవచ్చు.

Share this article :

Klematis
Add a description of the image here
Klematis
Add a description of the image here
Kcr
Add a description of the image here
Klematis
Add a description of the image here
saina
Add a description of the image here
saina
Add a description of the image here

FIND BUSINESSES BY COMPANY NAME

Search by first letter of Company Name
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
 
Support : Creating Website | Template | Template
Copyright © 2011. Hyderabad Classifieds - Channel Hyderabad - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by CHANNEL HYDERABAD