గర్భిణీల వేవిళ్లకు దివ్యౌషధంగా పనిచేసే అల్లం టీ!

CHANNEL HYDERABAD

రోజూ రెండు స్పూన్ల అల్లం రసం తీసుకుంటే శరీరానికి కొత్త ఉత్సాహం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అల్లం టీని సేవించడం ద్వారా గర్భణీలకు ఎంతో మేలు చేకూరుతుందట. వేవిళ్లకు చెక్ పెట్టడంలో అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది.

ఇంకా తెల్లవారున సాధారణ టీలో అల్లం బిస్కెట్లు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఛాతిలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం ముక్కలు రోజువారీగా ఒక టీ స్పూన్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అలాగే అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు దరిచేరవు. మోకాళ్ల వాపులు కూడా అల్లం రోజూ తీసుకుంటే తగ్గిపోతాయి. అలాగే అనారోగ్యంతో బాధపడేవారు అల్లం టీని సేవిస్తే ఉపశమనం లభిస్తుంది.

జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు మరిగించిన రెండు టీ స్పూన్ల అల్లం రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇకపోతే.. ఆస్తమా, దగ్గులకు చెక్ పెట్టాలంటే ఒక టీస్పూన్ అల్లం రసం, వెల్లుల్లి రసం ఒక టీస్పూన్‌ను తేనెతో కలిపి తీసుకోవాలి.

Hyderabad Business Directories