బీపీ... రక్తపోటు భయం వద్దు... ఈ ఆహారంతో కంట్రోల్ చేస్కోండి

CHANNEL HYDERABAD

అధికరక్తపోటుతో బాధపడుతున్నవారు భోజనానికి బ్రేక్ కొట్టకూడదు. అలాగే ఘనమైన ఆహార పదార్థాల నుంచి దూరంగా ఉండటం మంచిదంటున్నారు వైద్యులు. ఇంకా తీసుకునే భోజనంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలుండేలా చూసుకోవాలి.

ఉల్లిపాయలు, సగ్గుబియ్యం, సోయాబీన్, వెల్లుల్లిని కూడా ఆహారంగా తీసుకుంటుండాలి. భోజనంలో పొటాషియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా సోడియం తక్కువగా ఉండాలి. ఉప్పును తక్కువగా ఉపయోగించండి.

డైరీ ఉత్పత్తులు, చక్కెర, రిఫైన్డ్ ఆయిల్‌తో చేసిన ఆహార పదార్థాలు, వేపుళ్ళు, కెఫిన్, జంక్ ఫుడ్ లాంటివి తీసుకోకూడదు. రోజుకు కనీసం 10 నుంచి 12 గ్లాసుల నీటిని తప్పనిసరిగా సేవించాలి.

తక్కువ మోతాదులో సజ్జలు, గోధుమలు, జొన్నలు తీసుకుంటుండాలి. వీటి పిండితో తయారుచేసిన రొట్టెలు, పెసర పప్పు, సగ్గుబియ్యం, మొలకెత్తిన విత్తనాలను ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.

పాలాకు, గోబీలాంటి ఆకుకూరలను కూడా ఆహారంగా తీసుకోవాలి. కాయగూరలలో సొరకాయ, నిమ్మకాయ, బీరకాయ, పుదీనా, గుమ్మడికాయ, కాకరకాయ, దొండకాయలను తీసుకోవచ్చు. వాము, ఎండు ద్రాక్షపండు మరియు అల్లంను సేవిస్తే ఈ వ్యాధి బారిన పడినవారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది.

ఋతువులను అనుసరించి వచ్చే పండ్లు, బొప్పాయి, దానిమ్మ, జామ, ద్రాక్ష తదితర పండ్లు కూడా తీసుకోమని వైద్యులు సూచిస్తున్నారు. మీగడ లేని పాలు, మజ్జిగ, సోయాబీన్ నూనె, ఆవు నెయ్యి, బెల్లం, తేనె తదితరాలు సేవించవచ్చంటున్నారు వైద్యులు.

Hyderabad Business Directories