జలుబు చేసిందా...? తమలపాకు రసంతో చెక్...!

CHANNEL HYDERABAD

వర్షాకాలం వచ్చిందంటే జలుబు చేయడం సాధారణంగా జరుగుతుంటుంది. జలుబు ఇబ్బందితో బాధపడేవారు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే ఉపశమనం లభిస్తుంది.

జలుబుతో బాధపడుతుంటే మిరియాలు, బెల్లం, పెరుగు కలుపుకుని ఆ మిశ్రమాన్ని సేవించండి. దీంతో ముక్కుదిబ్బడ తొలగి ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు రాత్రి బాగా మరగబెట్టిన వేడి నీటిని సేవించడంతో జలుబు నుండి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎనిమిది మిరియాల గింజలు కాసింత నెయ్యిలో వేయించండి. తర్వాత దానిని వేడి వేడి పాలలో కలుపుకుని సేవించండి. దీంతో జలుబు తగ్గుతుంది. దీంతోపాటు శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. తమలపాకు రసంలో లవంగాలు, అల్లం రసాన్ని కలుపుకుని తేనెతో కలిపి సేవించండి. ఇలా నాలుగు రోజులపాటు సేవిస్తుంటే జలుబు మటుమాయమౌతుంది.

Hyderabad Business Directories