టిఫిన్ మానేస్తున్నారా.. అయితే చాలా నష్టమే జరుగుతుందట!

CHANNEL HYDERABAD

టిఫిన్ తినడం మానేస్తున్నారా.. అయితే మీ ఆరోగ్యానికి చాలా నష్టమే జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పొద్దుటిపూట హడావుడిగా అల్పాహారం తీసుకోకుండా ఆఫీసులకు వెళ్లిపోతున్నారా.. పిల్లలు కూడా స్కూలుకు టైమ్ అయిపోతుందని టిఫిన్ తినకుండా వెళ్తున్నారా.. అయితే మీ ఆరోగ్యానికి దెబ్బేనని నూట్రీషన్లు అంటున్నారు.

అల్పాహారం మానేసేవారిలో గృహిణులే అధికం. ఉదయాన్నే ఇంటిపనుల్లో తీరికలేకుండా ఉండడం, ఇంట్లోనే ఉంటాంకదా పొద్దుట పూట తినడం దేనికి అని వీరు పొద్దున తినడం మానేస్తుంటారు. రోజు మొత్తంలో ఉదయాన్నే తీసుకొనే అల్పాహారం ప్రాముఖ్యత ఎక్కువ.

అల్పాహారంపై జరిపిన అధ్యయనంలో 9-11 సంవత్సరాల వయసుగల విద్యార్థులలో ఉదయాన్నే అల్పాహారాన్ని మానేసిన పిల్లలు అల్పాహారం తీసుకొనే పిల్లల కంటే ఆటల్లో వెనకబడి ఉన్నారని, వీరిలో వెంటనే స్పందించే గుణం కూడా తక్కువ ఉందని తేలింది.

అలాగే ఉదయాన్నే అల్పాహారం తీసుకోని ఉద్యోగస్తులు తీసుకున్న వారితో పోలిస్తే పనిమీద ఏకాగ్రత నిలపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని, పని విషయంలోనూ అంత నైపుణ్యాన్ని చూపించలేరని వీరు చెబుతున్నారు.

ఉదయపు అల్పాహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి ఏర్పడే పోషకలేమి మధ్యాహ్నం పూట చేసే భోజనంతోగానీ, రాత్రిపూట కడుపుపగిలేలా తినే తిండితో కానీ భర్తీకాదు.

అందుకే రోజంతా చురుకుగా ఉండడానికి పనిచేసుకొనే సామర్థ్యం కోసం గృహిణులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ఉదయాన్నే అల్పాహారంలో ప్రోటీన్లు, పిండిపదార్థాలు ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Hyderabad Business Directories